NationalNews

ఎల్‌ఐసీ పాలసీ పునరుద్ధరణకు చాన్స్‌

Share with

ఎల్‌ఐసీ పాలసీలను మధ్యలోనే ఆపేశారా? సకాలంలో డబ్బులు అందక పాలసీని కొనసాగించలేకపోయారా? అయితే.. పాలసీ లాప్స్‌ అయిందన్న బాధ వద్దు..! మధ్యలోనే ఆపేసిన పాలసీని పునరుద్ధరించుకునేందుకు ఎల్‌ఐసీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి అక్టోబరు 21వ తేదీలోపు లేట్‌ ఫీజు కట్టి పాలసీలను మళ్లీ కొనసాగించుకునే ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశం వ్యక్తిగత పాలసీలకే వర్తిస్తుంది. ప్రీమియంను నిలిపివేసిన రోజు నుంచి ఐదేళ్లలోపు పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు.

రూ.లక్ష లోపు పాలసీకి 25 శాతం ఆలస్య రుసుము.. గరిష్ఠంగా రూ.2500 రాయితీతో పునరుద్ధరించుకోవచ్చు. పాలసీ రూ.1 – 3 లక్షల మధ్య ఉంటే 25 శాతం ఆలస్య రుసుము.. గరిష్ఠంగా రూ.3000 రాయితీతో మళ్లీ కొనసాగించుకోవచ్చు. రూ.3 లక్షల పైన పాలసీకి 30 శాతం ఆలస్య రుసుము.. గరిష్ఠంగా రూ.3500 రాయితీతో కొనసాగించుకోవచ్చు. అయితే.. ప్రీమియం కట్టకుండా ఆపేసినప్పటి నుంచి ఐదేళ్లలోపు పాలసీలను మాత్రమే పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పాలసీలను మాత్రం 100 శాతం లేట్‌ ఫీజుతో పునరుద్ధరిచుకోవాల్సి ఉంటుంది.