చంద్రబాబుకు బ్రెయిన్ పని చేయట్లేదా?
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు బ్రెయిన్ పని చేయట్లేదా? కందుకూరులో 8 మంది చనిపోతే వెంటనే కావలిలో మరో సభ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసమే గుంటూరులో బిచ్చంలాగా వస్తువును పంపిణీ చేశారు. నేనే ఒకప్పుడు చంద్రబాబు బిక్ష వేశా అని ఫైరయ్యారు కేఏ పాల్. చంద్రబాబు వల్లనే సభలు, సమావేశాలకు ప్రభుత్వం నిబంధనలు పెట్టిందన్నారు. ఎన్‌ఆర్‌ఐ నల్ల ధనాన్ని తెల్లగా మార్చడానికే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే ఏమిటని.. వారు బిచ్చగాళ్లా అంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. అసలు కేసీఆర్‌కు ఏపీలో అడుగు పెట్టే హక్కులేదన్నారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు అమ్ముడుపోయారని చంద్రశేఖర్ కుమారుడు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు తన దృష్టిలో టీడీపీ కన్నా వైసీపీ వంద రెట్లు నయమన్నారు. హరిరామ జోగయ్య ఈ వయసులో నీకెందుకు ధర్నాలు… దీక్షలు.. మీకు రిజర్వేషన్ కావాలా… రాజ్యాధికారం కావాలా… తనతో కలిసి రావాలని.. అప్పుడు మనందరం కలిసి పోరాటం చేద్దామంటూ కేఏ పాల్ పిలుపునిచ్చారు.

