Andhra PradeshHome Page Slider

ఏపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గడానికి కారణం అదేనా..

ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. దీనికి ప్రధాన కారణం ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయకుండా..గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అధికారులు వివరించారు. 2014 నుండి 2019 వరకూ ఉత్తమ విద్యావిధానాలను ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, విద్యా ప్రమాణాలను అనుసరించలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి చర్యలను తీసుకుంటున్నట్లు లోకేశ్ వివరించారు.