Home Page SliderNational

సమంత నిజంగానే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజమేనా అనే సందేహం ఎంతోమందికి కలిగే ఉంటుంది. గతకొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత మయోసైటిస్ చికిత్స కోసం ఓ ఏడాదిపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటారని సమాచారం. కాగా సమంత ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె విజయ్‌దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో కూడా ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తాయ్యాక ఆమె ఓ సంవత్సరంపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అందుకే సమంత ఇప్పటివరకు మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదట. కాగా ఇప్పటికే గతంలో ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టుల అడ్వాన్స్‌లు కూడా సమంత నిర్మాతలకు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.