రష్మిక స్పెషల్ పోస్ట్ అతని కోసమేనా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల “యానిమల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కాగా సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యానిమల్ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్‌లో కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే “నేను నీకొకటి చెప్పాలి అనుకుంటున్నా. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్” అని ఆమె ఓ కొటేషన్‌ను పోస్ట్ చేశారు. దీంతో రష్మిక ఎవరిని ఉద్దేశించి దీనిని పోస్ట్ చేశారు అని ఫ్యా న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ విజయ్ దేవర కొండ కోసం చేసిన సీక్రెట్ పోస్ట్ అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం వాళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం రష్మిక పుష్ప-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.


 
							 
							