అమృత్‌పాల్ నేపాల్‌లో ఉన్నాడేమో?
ఖలిస్థానీ సానుభూతిపరుడు, భారత ఉగ్రవాదిగా అనుమానిస్తున్న అమృతపాల్ సింగ్ కోసం ముమ్మరంగా వెదుకులాట కొనసాగుతోంది. అతడు దేశ సరిహద్దులు దాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత నాలుగైదు రోజులలో అతడు హరియాణా నుండి ఉత్తరాఖండ్ చేరుకుని, అక్కడ నుండి నేపాల్ మీదుగా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల అనుమానం. అతడిని పట్టుకోవడానికి భారత్-నేపాల్ సరిహద్ధుల వద్ద చెక్ పోస్టులను వదలకుండా గాలిస్తున్నారు. అక్కడి చెక్పోస్టులపై, భారత్ నేపాల్ సరిహద్దుల వద్ద అతడి పోస్టర్లను కూడా అంటించారు. హర్యానాలో అతనికి ఆశ్రమమిచ్చిన మహిళను విచారించగా ఆమె ఉత్తరాఖండ్ వెళ్లాడని తెలిపింది. దీనితో ఉత్తరాఖండ్ నుండి నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించవచ్చని పోలీసుల అభిప్రాయం.

