Insurance: ‘ఫ్రీ లుక్ పీరియడ్’ అంటే తెలుసుకోవాలని లేదా?
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక 30 రోజుల వరకూ ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో పాలసీని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. నచ్చకపోతే రద్దు చేసుకోవచ్చు. పాలసీలో ఏదైనా మోసపూరితంగా ఉన్నట్లు మీరు గుర్తిస్తే కంపెనీకి తెలియజేయాలి. కొన్ని సంస్థలు పాలసీ రద్దు చేసేందుకు గాను చాలా వెసులుబాట్లు కల్పించాయి. అవి ఏమిటంటే ఈ రోజుల్లో అంతా ఇంటర్‌నెట్ వచ్చాక వెబ్‌సైట్లోనే చేసుకునే అవకాశం ఇన్సూరెన్స్ కంపెనీలు కల్పిస్తున్నాయి. కాగా కొన్ని సందర్భాల్లో 30 రోజుల తర్వాత ఈ రద్దు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల పెనాల్టీ ఛార్జెస్ వేస్తారు.

