Home Page SliderTelangana

వేధించే బదులు ఎన్ కౌంటర్ చేయండి..

నిజామాబాద్‌లో ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. మాజీ మేయర్ భర్త శేఖర్ బాధితుడినంటూ షేక్ రసూల్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో శేఖర్‌పై షేక్ రసూల్ దాడి చేశాడు. ఆ దాడి కేసులో జైలుకెళ్ళాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై రసూల్ బయటికొచ్చాడు. అయితే.. బెయిల్ పై వచ్చినప్పటి నుంచి తనను పోలీసులు వేధిస్తున్నారంటూ రసూల్ ఆరోపిస్తున్నాడు. ఐదో టౌన్ ఎస్ఐ వ్యక్తిగతంగా తనను టార్చర్ పెడుతున్నారని రసూల్ పేర్కొన్నాడు. రోజు రోజు వేధించే బదులు తనను ఎన్‌కౌంటర్‌ చేయాలని రసూల్ సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు.