Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రభుత్వ ఉద్యోగుల వినూత్న నిరసన- సెల్‌ఫోన్ డౌన్

ఆంధ్రప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నారు.  తమ డిమాండ్ల సాధన కోసం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి సెల్‌ఫోన్ డౌన్ అనే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ రోజంతా ఉద్యోగులు సెల్‌ఫోన్ వాడకుండా ఉంటారు. తమ వినతి పత్రాలను కలెక్టర్లకు ఇప్పటికే అందజేశారు. రేపు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేయబోతున్నారు. అటు పిమ్మట మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఈ నెల 15న పరామర్శిస్తారు. ఈ నెల 18న సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపడతారు.