NationalNews

15వ వసంతంలోకి ఆరా సర్వే సంస్థ

Share with

సర్వే రంగంలో కచ్చితత్వానికి మారుపేరు “ఆరా” సంస్థ
సర్వే రంగంతోపాటు.. సేవా రంగంలో ముందంజ

ఒక రుషి, పొలిటికల్ సర్వేలకు బిగ్ బాస్, సాదాసీదా జీవితం ఇష్టపడే వ్యక్తి, నలుగురికి మంచి చేయాలనే ఆలోచన కలిగిన మహా మనిషి… ఆయనే ఆరా ఫౌండేషన్, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత షేక్ మస్తాన్. ప్రధాని నుండి ఎమ్మెల్యేల వరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి రాజకీయ నాయకునికి పరిచయం అక్కర్లేని పేరు ఆరా మస్తాన్. ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ నేటికీ విజయవంతంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి సంస్థ అడుగు పెట్టింది.

రాజకీయ నాయకులకు నమ్మకమైన, నిబద్ధత కలిగిన సంస్థ.. ఆరా సంస్థ

2008లో స్థాపించిన ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నేటి వరకు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, నాయకుల విజయం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఓటర్ల ప్రాధాన్యతలు… ఓటర్ల అభిరుచులు… వారికి కావలసిన అభివృద్ధి, సంక్షేమంపై నిరంతరం దృష్టి సారించి సమగ్ర అవగాహన పెంచుకొని ఆయా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు… ఓటర్ల మనోభావాలను తెలిపి తద్వారా వారి గెలుపు కోసం సహాయ సహకారాలు అందిస్తూ మంచి నమ్మకాన్ని సంపాదించుకుంది. వ్యవస్థీకృత సర్వేలు నిర్వహించటం విశ్లేషణాత్మక నివేదికలను రూపొందించటం ఓటర్ల ప్రాధాన్యతలను వాస్తవికతకు దగ్గరగా అర్థం చేసుకోవడం ఆరా సంస్థ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. నేటి సమాజంలో రాజకీయ రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీకి రాజకీయ నిర్వహణ సంస్థ అనేది ఒక ముందస్తు అవసరంగా మారింది.


రాజకీయ నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఓటర్ల మనోభావాలు… వారి అభిప్రాయాలు అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు లాంటి నివేదికలు అందజేయటంలో నమ్మకమైన నిబద్ధత కలిగిన సంస్థగా ఆరా సంస్థ రూపుదిద్దుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సర్వే అనేది ఓటర్ల మీద పరిశోధన. ఆయా వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకుంటుంది. ఈ పరిశోధనలో ఆరా సంస్థ అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రత్యేక శిక్షణ పొందిన ఫీల్డ్ సిబ్బంది ద్వారా సర్వేలను నిర్వహించి సరైన ఫలితాలను ప్రజలకు గడిచిన 15 సంవత్సరాలుగా అందిస్తూ వస్తోంది. ఒపీనియన్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించడంలో ఆరా సంస్థ కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసింది. 15 వసంతాల కాలంలో ఆరా సంస్థ ఇచ్చిన సర్వేలు ఏ రోజు ఫెయిల్ కాలేదు. కచ్చితత్వానికి మారుపేరుగా ఆరా సంస్థ నేటి వరకు నిలబడింది అంటే దాని కారణం ఆ సంస్థ సీఈవో మస్తాన్ కృషి నిదర్శనమని చెప్పాలి.

కష్టపడి పనిచేసే తత్వం.. ఆరా ఎం.డి మస్తాన్ సొంతం

క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేసే గుణం జీవితంలో ఒక స్థిరమైన విజయాన్ని అందిస్తాయని ఆ సంస్థ ఎం.డి మస్తాన్‌ని చూస్తే నిజం అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎంతో ఒత్తిడితో కూడిన రంగం పొలిటికల్ సర్వే రంగం… 2007లోనే ఆ రోజుల్లో సర్వేలు అంటే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రోజులు.. కానీ ఆ రోజుల్లోనే మట్టిలోని మాణిక్యం లాగా 1986 లో ఒక చిన్న పల్లెటూరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట… మద్దిరాల గ్రామంలో జన్మించిన మస్తాన్ సెఫాలజీ కోర్సును పూర్తిచేసి 2008 లో ఆరా (AARAA) పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కష్టించి పనిచేసి సంస్థను శిఖరాగ్రాన కూర్చోబెట్టారు. ఆరా సంస్థ 15వ వసంతలోకి అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు భారతదేశంలోని ఏ ప్రముఖ రాజకీయ నాయకుడికైన మస్తాన్ సుపరిచితమే. ఎంతోమంది రాజకీయ నాయకుల ఎదుగుదలకు మస్తాన్ అందించిన సేవలు నిరుపమానం.

జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా వ్యవస్థీకృత సర్వేలు నిర్వహించి విశ్లేషణాత్మకంగా నివేదికలు రూపొందించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది… ఏ అభ్యర్థి గెలుస్తాడు అని కచ్చితమైన అనాలసిస్ అందించగల నేర్పరి మస్తాన్. నేటికీ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తాను నమ్ముకున్న వృత్తిలో రాణిస్తూ అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది పేదల కడుపు నింపారు. ఉచితంగా కూరగాయలు నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు. సొంత గ్రామంలో జనతా బజారును స్థాపించి అతి తక్కువ రేటుకు నిత్యావసర సరుకులు గ్రామ ప్రజలకు అందించారు. కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాలు జరిగినన్ని రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిరాఘాటంగా జరుపుతారు మస్తాన్.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ దేవాలయంలో అన్నదానం కార్యక్రమం జరిగిన ఆయా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. ప్రతి వ్యక్తి ఎదుగుదలకు విద్య ఎంతో అవసరం అని భావించే మస్తాన్ ప్రతి సంవత్సరం తన సొంత గ్రామమైన మద్దిరాల గ్రామం పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో మొదటి ర్యాంకులు సాధించిన వారికి ఆరా సంస్థ తరపున స్కాలర్ షిప్‌లు పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అలానే విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా తమ సంస్థ తరఫున బస్సు పాసులను కూడా అందిస్తున్నారు.

ఇలా సర్వే రంగంలో రాణిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి ఎదుగుదలకు తనను నమ్ముకున్న వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు మస్తాన్.