రెండో టెస్టులో ఇండియా బంపర్ విక్టరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో సూపర్ విక్టరీ సాధించిన భారత్, రెండో టెస్టులోనూ విజయం సాధించింది. ఇవాళ జడేజా అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా చిత్తు చిత్తయ్యింది. ఆస్ట్రేలియాపై 115 పరుగుల ఛేజింగ్‌లో KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, నాలుగు వికెట్లను కోల్పోయింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తొందరగానే నిష్క్రమించడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రాహుల్ 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. భయానక ఫామ్‌ను కొనసాగిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఛతేశ్వర్ పుజారాతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కొన్ని అద్భుతమైన షాట్‌లను కొట్టాడు. మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే తన ఉద్దేశాలను స్పష్టం చేశాడు. భారత మాజీ కెప్టెన్‌ను 31 బంతుల్లో 20 పరుగులకు అవుటయ్యాడు శ్రేయస్ అయ్యర్ 12 పరుగులకు ఔటయ్యాడు. పూజారా, తెలుగు క్రికెటర్ శ్రీకర్ భారత్ మ్యాచ్‌ను తమదైన స్టైల్లో ముగించారు. పూజారా 31 పరుగులు, భరత్ 23 పరుగులు చేశారు. విన్నింగ్ షాట్ ను పూజారా కొట్టాడు. రెండో టెస్టులో భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి సచిన్ టెండూల్కర్ యొక్క ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. న్యూఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 3వ రోజు ఈ ఘనత సాధించాడు. 577 మ్యాచ్‌లలో మైలురాయికి చేరుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ నేడు అధిగమించాడు. మరోవైపు విరాట్ 549 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (588), జాక్వెస్ కలిస్ (594), కుమార సంగక్కర (608), మహేల జయవర్ధనే (701) ఉన్నారు.

అంతకుముందు మ్యాచ్‌లో, భారత్ స్పిన్ కవలలు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల అద్భుతమైన ప్రదర్శన అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో సహా, ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య జట్టుకు 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడానికి సహకరించారు. సిరీస్‌లో తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని పొందేలా చేశారు. ట్రావిస్ హెడ్ 39, మార్నస్ లాబుస్‌చాగ్నే 16 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను 61/1 వద్ద పునఃప్రారంభించింది. సెషన్ ప్రారంభంలోనే అశ్విన్ 46 బంతుల్లో 43 పరుగుల వద్ద ప్రమాదకరమైన హెడ్‌ని అవుట్ చేసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే ద్వయం తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. స్మిత్‌ను అశ్విన్కే 9 పరుగులకే అవుట్ చేసే ముందు మరో 20 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. అంతకుముందు రవీంద్ర జడేజా ఏడు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 113 పరుగులకే కట్టడి చేసింది.