పాకిస్తాన్ పై భారత్ గెలుపు, దుమ్మురేపిన కోహ్లీ
టీ 20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లో పాకిసాన్ పై భారత్ జట్టు సంచలన విజయం సాధించింది. గెలుపు… నీదా.. నాదా అనుకుంటున్న తరుణంలో టీమ్ ఇండియా కసిగా ఆడి మ్యాచ్ గెలిచింది. కోహ్లీ, హార్దిక్ పాండే మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. మ్యాచ్ గెలుస్తామా, లేదా అనుకుంటున్న తరుణంలో సత్తా చాటి ఔరా అన్పించుకున్నాడు కోహ్లీ. చివరి ఓవర్లో 16 పరుగులు సాధించాల్సి ఉండగా.. కోహ్లీ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. మహ్మద్ నవాజ్ వేసిన ఆ బాల్ నోబాల్ గా ఎంపైర్ డిక్లేర్ చేయడంతో ఇండియా విజయం ఖాయమయ్యింది. అదే సమయంలో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా, నవాజ్… విసిరిన బాల్ వైడ్ అవడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత బాల్ అశ్విన్ ఫోర్ కొట్టడంతో ఇండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దివాలీకి ఒక రోజు ముందే ఇండియాకు సంబరాన్ని తీసుకొచ్చింది టీం ఇండియా. కోహ్లీ ఒంటి చెత్తే మ్యాచ్ గెలిపించి అభిమానుల మనసు చూరగొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇక భారత్ జట్టు టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైనా… 53 బంతులకు 82 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచి… టీమ్ ఇండియాను గెలిపించాడు కోహ్లీ. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో పాకిస్తాన్ పనిపట్టాడు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చొని 90 వేల మంది వీక్షిస్తే.. ఒక్క హాట్ స్టార్ యాప్ నుంచి కోటీ 60 లక్షల మంది వీక్షించడం విశేషం.


