Home Page SliderNational

ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ దిశగా భారత్ (52/5)

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య విదర్భ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియం నాగపూర్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా, ఇన్నింగ్స్ విక్టరీ దిశగా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా పతనం మొదలయ్యింది. అంతకుముందు రోహిత్ శర్మ 120, అక్షర్ పటేల్ 84 పరుగులతో భారత్‌ను 400 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ చేసింది. దీంతో టీమ్ ఇండియాకు 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు పడగొట్టినా.. భారత్ 400 పరుగులు చేరుకొంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్ల ధాటికి భారత్ ఆస్ట్రేలియాను 177 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజా ఒక్క వికెట్ తీశాడు.