NewsTelangana

ఇటు గవర్నర్… అటు కేసీఆర్

Share with

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటిస్తున్నారు. ముంపు బాధితులతో గవర్నర్ మాట్లాడారు. వారం రోజులుగా ఎదుర్కొంటున్న కష్టాలను గవర్నర్‌కు వివరించారు. పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన గవర్నర్… సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తానని చెప్పారు. జిల్లాలోని మరికొన్న ప్రాంతాల్లోనూ తమిళిసై ఇవాళ పర్యటిస్తారు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా సర్పంచ్‌లు గవర్నర్‌ను కోరారు.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గోదావరి పరివాహక వరద ముంపు ప్రాంతాల పరిశీలించారు. భద్రాచలం వద్ద కరకట్ట పైనుంచి గోదావరి వరద పరిశీలించి… గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భద్రాచలం పట్టణంలో చర్ల రోడ్డులో ఉన్న పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ముంపు బాధితులతో కేసీఆర్ మాట్లాడారు. భద్రాచలం ఐటిడిఏలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.