NationalNews

అల్-జవహరీని మట్టుబెట్టిన అమెరికా

Share with

మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అల్-జవహరీని అమెరికా హతమార్చింది. కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అతనిని మట్టుబెట్టినట్టు అమెరికాకు చెందిన మీడియా సంస్ధలు తెలియపరిచాయి. ఇదిలా ఉండగా ఆఫ్ఘానిస్తాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్టు శ్వేతసౌధం వెలువరించింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా టైం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు వెళ్లడించనున్నట్టు తెలిపింది. అల్‌-జవహరీ ఈజిఫ్టులో జన్మించిన వైద్యుడు, వేదాంతవేత్త.. కానీ 2011 జూన్ నుంచి 2022లో మరణించే వరకు తీవ్రవాద గ్రూప్ అల్-ఖైదాకు నాయకుడిగా ఉన్నాడు. ఎంత పెద్ద టెర్రరిస్టు అంటే ఒసామా బిన్ లాడెన్ మరణించిన తర్వాత స్థానంలో నిలిచి చేసే పనులని నిర్వహించేవాడు.

అంతకముందు వరకు ఆసియా , ఆఫ్రికా , ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో దాడులకు నాయకత్వం వహించిన ఇస్లామిక్ సంస్ధల్లో సీనియర్ సభ్యునిగా ఉన్నాడు. ముస్లిం దేశాలలో ఉన్న పాశ్చాత్యులని కిడ్నాప్ చేసేందుకు 2012లో కొందమంది ముస్లింలను పిలిపించాడు. అయితే  2001 సెప్టెంబర్ 11న అమెరికాలో  జరిగిన  ఉగ్రదాడుల్లో 3 వేల మందికి పైగా మరణించగా , ఈ దాడికి పాల్పడిన సూత్రదారునిగా అల్-జవహరీని అమెరికా గుర్తించింది. ఆ ఘటన తర్వాత అల్- జవహరీని మోస్టు వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీని అమెరికా పరిగణించింది. అప్పటినుండి పరారీలో ఉన్న ఇతనిని పట్టుకునేందుకు 25 మిలియన్ డాలర్ల రివార్టుని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.