Home Page SliderNational

విరూపాక్ష ఏ ఓటీటీలో వస్తోందంటే?

సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష ఓటీటీలో రాబోతోంది.  సాయి ధరమ్‌తేజ్, సంయుక్త నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దర్శకుడు కార్తిక్ దండు రూపొందించిన విరూపాక్ష సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పటికే 90 కోట్ల పై చిలుకు కలెక్షన్లు సాధించింది. 100 కోట్లకు పరుగులు పెడుతోంది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా ఈ నెల 21 నుండి స్ట్రీమింగ్ చేయడానికి అనుమతి లభించింది. ఈ చిత్రం ఏప్రిల్ 21 న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఒక నెల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.