Home Page SliderNational

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రోజూ వంద కోట్లకుపైగా సొత్తు స్వాధీనం: ఈసీ వెల్లడి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా సోదాలు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికవరీలు
రోజూ 100 కోట్ల విలువగల వస్తువుల స్వాధీనం
రికవరీలో మేజర్ షేర్ డ్రగ్స్‌దేనన్న ఈసీ
ఉచితాలను భారీగా పట్టుకున్నామని వెల్లడి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.2069 కోట్ల విలువైన డ్రగ్స్‌తో సహా రూ.4,650 కోట్లను తమ పర్యవేక్షణలో అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రికవరీ చేసిన రూ.3,475 కోట్లకు మించి మార్చి 1 నుంచి జప్తు చేసినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికలను మార్చి 16న ప్రకటించగా, మొదటి దశ ఏప్రిల్ 19న, చివరి ఎన్నిక జూన్ 1న జరగనుంది. మార్చి 1 నుంచి అధికారులు ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన జప్తు చేస్తున్నారని కమిషన్ పేర్కొంది. మొత్తం రికవరీలు రూ.4,658 కోట్లలో నగదు భాగం రూ.395 కోట్లకుపైగా ఉండగా, మద్యం రూ.489 కోట్లకు పైగా ఉంది. పట్టుబడిన వాటిలో 45 శాతం డ్రగ్స్ వాటా 2,069 కోట్లు. 18వ తేదీన జరగనున్న తొలి విడత పోలింగ్‌కు ముందే ధనబలంపై ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన పోరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. ఇది దేశంలోని లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ హైని తాకింది.

శుక్రవారం నుంచి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. “2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున, దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి” అని EC ఒక ప్రకటనలో తెలిపింది. డ్రగ్స్ జప్తులో అత్యధికంగా రూ. 2,068 కోట్లు, ఆ తర్వాత రూ. 1,142 కోట్ల విలువైన ఉచితాలు (ఫ్రీబీలు) ఉన్నాయి. దాదాపు రూ.490 కోట్ల విలువైన 3.58 కోట్ల లీటర్ల మద్యాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. సీజ్‌లో భాగంగా రూ.395 కోట్ల నగదు, రూ.562 కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయి. అత్యధికంగా రాజస్థాన్ (రూ. 779 కోట్లు), గుజరాత్ (605 కోట్లు), మహారాష్ట్ర (రూ. 431 కోట్లు) నుంచి స్వాధీనం జరిగింది. రాజస్థాన్‌లో అత్యధికంగా రూ.533 కోట్ల విలువైన ఉచితాలు (ఫ్రీబీలు), రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్‌ వాటాగా ఉన్నాయి. 41 కోట్ల విలువైన 37.98 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా ఎన్నికల సంఘం సీజ్ చేసింది. గుజరాత్, మహారాష్ట్రలో డ్రగ్స్ అత్యధికంగా పట్టుబడ్డాయి. గుజరాత్ నుండి స్వాధీనం చేసుకున్న రూ. 605 కోట్లలో, రూ. 486 కోట్లు డ్రగ్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో రూ.431 కోట్లలో రూ.214 కోట్లు డ్రగ్స్ వాటా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన మొత్తం స్వాధీనంలో దాదాపు 75 శాతం మాదకద్రవ్యాలే ఉన్నట్టుగా ECI ప్రకటనలో పేర్కొంది.

ఎన్నికలను ప్రభావితం చేయడానికి నల్లధనాన్ని ఉపయోగించే ప్రమాదంతో పాటు, మాదకద్రవ్యాలు ఎక్కువ ప్రభావితం చేస్తూున్నాయని ఈసీ అభిప్రాయపడింది. నోడల్ ఏజెన్సీలను సందర్శించిన సందర్భంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో ఏజెన్సీల గట్టిగా పనిచేస్తున్నాయని ఈసీ పేర్కొంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కీలకమైన మార్గాలు కారిడార్‌లను గుర్తించడానికి, సమర్థవంతమైన ప్రతిఘటనలు అమలులో ఉన్నాయని నిర్ధారించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టరేట్, సీనియర్ అధికారులతో కమిషన్ సహకరిస్తోందని ఈసీ వివరించింది. గత కొన్ని సంవత్సరాలుగా, గుజరాత్, పంజాబ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం వంటి రాష్ట్రాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గణనీయమైన జప్తులు జరిగాయి.