హైదరాబాద్‌కు భారీవర్షసూచన
ఈరోజు మధ్యాహ్నం హఠాత్తుగా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయిరా దేవుడా అని ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయంలో అకస్మాత్తుగా ఆకాశం కారుమబ్బులతో నిండిపోయి సూర్యుడిని కప్పిసింది. మళ్లీ మేఘగర్జన వినిపించింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, హైటెక్‌సిటీ ప్రదేశాలలో భారీవర్షం పడుతోంది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్ జామ్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, కాలేజీలనుండి ఇంటికి వెళ్లే సమయంలో వాన నీళ్లలో ప్రయాణం నరకంగా మారింది.
ఈమధ్య షియర్‌జోన్ ప్రభావంతో బాటు, రుతుపవనాల వల్ల తెలంగాణా జిల్లాలలోనూ, రాజధానిలోనూ అప్పటికప్పుడే మేఘాలు ఏర్పడి భారీవర్షం కురుస్తోంది. కాగా ఈ ఆకస్మిక వర్షాలపై GHMC మేయర్ విజయలక్ష్మి సమీక్ష నిర్వహించి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షపు నీరు నిలవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Read more: దొరా నీవల్ల ఉపయోగమేంటంటూ షర్మిల కౌంటర్