TTDలో లోతుగా విచారణ..మాజీలకు నోటీసులు
TTDలో జరిగిన అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమయ్యింది. విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విషయంగా విచారణ కోసం మాజీ టీటీడీ ఛైర్మన్లు భూమన కరుణాకర రెడ్డి, సుబ్బారెడ్డిలకు నోటీసులు వచ్చాయి. మాజీ ఈవోలు ధర్మారెడ్డి, జవహర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు వివరణలు కోరినట్లు సమాచారం. గత ప్రభుత్వ కాలంలో అన్ని విభాగాలలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఖర్చులు, లావాదేవీలపై ఉద్యోగుల నుండి ఇప్పటికే వివరాలు సేకరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై కూడా దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపైన కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.

