రాజస్థాన్‌లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశం
రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ రాజస్థాన్ ఉదయపూర్ లో సమావేశమయ్యింది. వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో… ఆర్ఎస్ఎస్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రాంత ప్రచారకులు, స్థానిక ప్రచారకులు మూడు రోజుల సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్థాన్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో కన్నయ్య లాల్ హత్యతో ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ కు సంబంధించిన తీవ్రవాద మూకలు హత్య చేసి ఉంటాయని భావిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇలా సమావేశాలను ఏటా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోంది. RSS సంస్థాగత ప్రయోజనాల కోసం దేశాన్ని 11 ప్రాంతాలు, 45 ప్రావిన్సులుగా విభజించింది. ఒక ప్రాంత ఇన్‌చార్జిని ప్రాంత ప్రచారక్ అంటారు.
రాజస్థాన్‌లో జరిగిన కన్నయ్య లాల్ అంశానికి సంబంధించి ఎలాంటి వివాదాలకు తీవివ్వకుండా… ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆదేశాలతో… ముస్లిం వింగ్… ముస్లిం రాష్ట్రీయ మంచ్ పలు చోట్ల సంతాప సభలు నిర్వహిస్తోంది. దేశంలో స్నేహబంధాన్ని కొనసాగించేందుకు మంచ్ ఇతర ముస్లిం సంస్థలకు చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక రాబోయే సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల ప్రణాళికలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 2025 సంవత్సరం ఆర్ఎస్ఎస్ వందేళ్లు ఉత్సవాలను జరుపుకోనుంది. ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే, ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించిన 45 ప్రాంతాల ముఖ్య ప్రచారకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. బీజేపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, శివప్రకాష్ కూడా సమావేశాల్లో పాల్గొంటారు.