అమెరికా వీసా కావాలంటే ఈ పని చేయాల్సిందే..
ఇకపై అమెరికా వీసాలు కావాలంటే ఎప్పటిలా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరిపోదు. అమెరికా వెళ్లాలనుకునేవారికి నఖశిఖపర్యంతం పూర్తి స్థాయిలో చెకింగ్ ఉండాల్సిందే. వలసలని కట్టుదిట్టం చేసే పనిలో భాగంగా ట్రంప్ సర్కారు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇకపై వీసా లేదా గ్రీన్ కార్డుకు అప్లైయ్ చేసుకోవాలంటే సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా హోంశాఖ ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో సందేశాలు, పోస్టులపై సర్కారు నిఘా ఏర్పాటు చేస్తుంది. దీనితో హెచ-1బీ, ఈబీ-5 వంటి వీసాలకు ప్రయత్నించేవారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చు.

