ఈ నాలుగు మిస్సయితే అంతే..
సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెప్తుంటారు. కానీ ఇటీవల మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైన నాలుగు పోషక పదార్ధాలను మిస్సవుతున్నామని, అవి తప్పకుండా తీసుకోవాలని ఒక పరిశోధనలో తేలింది. ఈ పోషకాలు మిస్సయితే ఆరోగ్యం దెబ్బితిని, రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఈ. ఈ పోషకాలు ప్రపంచ వ్యాప్తంగా ఏభైశాతం మందికి పైగా ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలింది. ఈ పోషకాలు లోపిస్తే పలు వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ కూడా తగినంతగా తీసుకోవాలి. సగానికి పైగా ప్రజలలో రిబోప్లావిన్, ఫోలేట్, విటమిన్ బీ6, విటమిన్ సి లోపాలున్నట్లు కనిపెట్టారు.

మొలకెత్తిన గింజలు, సిట్రస్ పండ్లు, బ్రకోలి వంటి ఆహారంలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్, చేపలు, డ్రైఫ్రూట్స్, అవకాడో, మామిడి పండు వంటి ఆహారంతో విటమిన్ ఈ లోపాన్ని నివారించవచ్చు.
సీడ్స్, ఛీజ్, పెరుగు, బీన్స్, పాలు, చిరుధాన్యాలలో కాల్షియం బాగా ఉంటుంది. ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించవచ్చు.
షెల్‌ఫిష్, పాలకూర, మాంసం, గుమ్మడి గింజలు వంటి ఆహార పదార్థాల ద్వారా ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. ఈ రకమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషక లోపాలను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.


 
							 
							