ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేస్తే అంతే సంగతులు..
ఫ్రీ యాక్సెస్ కలిగిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, వివిధ సైట్ల లింక్స్ క్లిక్ చేయడం వల్ల సైబర్ మోసాలు, హ్యాకింగ్ వంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా లింక్ లు ఓపెన్ చేసే ముందు వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దంటున్నారు నిపుణులు. మీ ఆన్ లైన్ సెర్చింగ్, సోషల్ మీడియా స్కోలింగ్ వంటివీ సేఫ్ గా ఉండేందుకు ఫోన్, కంప్యూటర్లలో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అలాగే ఎప్పుడూ ఒకే రకమైన పాస్ వర్డ్ కూడా వాడకూడదు. అప్పుడప్పుడూ మారుస్తూ ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రతీ లావాదేవీ కూడా మీకు ఫోన్ లేదా మెయిల్ కు అలర్ట్ మెసేజ్ వచ్చేలా సెట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

