Home Page Sliderhome page sliderTelangana

50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తా..

తెలంగాణ మేడ్చల్ జిల్లాలోని షాపూర్ నగర్ లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడి కుటుంబాన్ని లేఖలో టార్గెట్ గా చేసుకున్నారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే రవీందర్ గౌడ్ కుమారుడు కూన రాఘవేందర్ గౌడ్ ను చంపుతామని లేఖలో పేర్కొన్నారు. రెండు ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు తులసి కుండీ ధ్వంసం చేసి, కారుపై బెదిరింపు లేఖను ఉంచారు. అంతేకాక కారుపై ఎరుపు రంగు టవల్లో లేఖ పెట్టి వెళ్లిపోయారు. ఘటన ఈ నెల 21న జరిగినట్లు రాఘవేందర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు మాస్క్ ధరించిన వ్యక్తిని గుర్తించారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.