NewsTelangana

కేసీఆర్‌ ప్రభుత్వం ఉంటే ఎంత ఉడితే ఎంత..షర్మిల ఆగ్రహం

Share with

బాసర IIT లో జరిగిన సంఘటనపై YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కేసీఆర్ మండిపడ్డారు. కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో ఉన్న విద్యార్ధి చనిపోవడంపై స్పందించిన షర్మల కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్దులకు సరైన ఆహారం పెట్టకుండా… కేసీఆర్ విఫలమయ్యారన్నారు . కలుషిత ఆహారం కారణంతోనే విద్యార్ధి జీర్ణకోశ వ్యాధితో చనిపోయాడని , అతని చావుకి కేసీఆర్ కారణమయ్యాడన్నారు. సరైన తిండి పెట్టండి అని విద్యార్ధులు ఎన్ని దీక్షలు చేసిన ప్రభుత్వం మాత్రం వాటిని పెడచెవిన పట్టిందన్నారు. అందువల్లే ఇలాంటి దారుణం చోటుచేసుకుందన్నారు.

ఈ తిండి తింటే చస్తాం అని విద్యార్ధులు తెలిపిన , సరే అని సరిపెట్టింది తప్ప భోజనంలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. మాట ఇచ్చిన నెల లోపే వందల మంది విద్యార్ధులు కలుషిత ఆహరం తిని ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు దొరా అని ప్రశ్నించారు. ఇప్పటికైన నీ ప్రభుత్వం కండ్లు తెరుస్తుందా ? చదువుకొనే పిల్లలకు సరైన తిండి పెట్టని సర్కార్ ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? అని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.