రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
ఏపీ ప్రభుత్వం తరపున 7 లక్షలు బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలకు ఇస్తున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇది రైతులకు ప్రభుత్వం ఇస్తున్న మానవతా సహాయమన్నారు. అందులో ఒక్క రూపాయి నేను తీసుకున్నట్లు, కనీసం ఒక్క కుటుంబం దగ్గరైనా ఒక్క పైసాకు కక్కుర్తి పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయటమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పి పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు అంబటి. నీకు దమ్ముంటే నిరూపించు నేను రైతుల కుటుంబాల దగ్గర రూ.2 లక్షలు తీసుకుంటున్నానా? ధైర్యం ఉంటే నిరూపించు లేకపోతే ఎప్పుడు పారిపోయినట్టే హైదరాబాద్ పారిపో అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తన మీద వ్యక్తిగతం విమర్శలు చేసేందుకు పవన్ కల్యాణ్ సత్తెనపల్లి ఎంచుకున్నాడని విమర్శించారు.

