దిగ్గజ పాక్ గాయని నూర్ కన్నుమూత
పాకిస్థాన్ దిగ్గజ గాయని నయ్యారా నూర్ అనారోగ్యంతో మరణించారు. ఆమె తన అధ్భుత గానాలతో అటు పాకిస్థాన్‌తో పాటుగా భారత్‌లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెలోడి క్విన్ గా గుర్తింపు తెచ్చుకున్న నూర్ ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నయ్యారాకు అధికారిక సంగీత శిక్షణ లేనప్పటికీ , 1968లో లాహౌర్‌లోని ఆర్ట్స్‌లో వార్షిక విందులో తన స్నేహితులు , ఉపాధ్యాయుల కోసం ఆమె పాడడం విన్న తర్వాత లాహౌర్‌లోని ఇస్లామియా కాలేజీలోని ప్రొఫెసర్ అస్రార్ అహ్మద్ ఆమెను కనుగొన్నారు.

ఆమెకు విశ్వవిద్యాలయంలోని రెడియో పాకిస్థాన్ కార్యక్రమాలకు పాడమని అడిగారు. అక్కడి నుండి ఆమె తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1971లో పాకిస్థాన్ టెలివిజన్ సీరియల్స్‌లో బహిరంగంగా పాటలు పాడడం ప్రారంభించారు. అంతే కాకుండా ఘరానా , తాన్సేన్ వంటి చిత్రాలకు ఆమె తన గానాన్ని అందించారు. 1958లో ఆమె కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వలస వెళ్లారు.

