NationalNews

చిన్నారి గాయం చూసి ఐఏఎస్ కన్నీరుమున్నీరు

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం.. వరుస ప్రమాదాలు అమాయకులను బలిగొంటూనే ఉన్నాయ్. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో బుధవారం ట్రక్కు-బస్సు ఢీకొన్న ప్రమాదంలో కనీసం పది మంది మరణించారు. సుమారుగా 41 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 12 మందిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. గాయాల నొప్పి భరించలేక చిన్నారులు విలవిలలాడుతున్నారు. మొత్తం ఘటనను ప్రత్యక్షంగా చూసిన లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ చలించిపోయారు. గాయపడిన వారి కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు.. అమ్మా నొప్పి అంటూ చిన్నారు చేస్తున్న ఆక్రందనలతో కన్నీరుమున్నీరయ్యారు. ఐఏఎస్ అధికారి పరామర్శ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. వీడియోలో, ప్రమాదంలో గాయపడిన చిన్నారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు జాకబ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారి 730లోని ఐరా బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగిందని యూపీ పోలీసులు వెల్లడించారు. ధౌర్హరా నుండి లక్నోకు వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సందేశం పంపారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ప్రమాదంతో కలత చెందానన్నారు ప్రధాని మోదీ. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మృతుల కుటుంబీకులకు PMNRF నుండి ₹ 2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేలు అందిస్తామని మోదీ చెప్పారు.

ఇటీవల లక్నోలో వర్షాల దెబ్బకు వీధులన్నీ నీటితో నిండిపోయినప్పుడు ఆదేశాలతో సరిపెట్టుకుంటా… నేరుగా రంగంలోకి దిగా… సిబ్బందికి రోషన్ సూచనలు సలహాలు ఇచ్చారు. తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004-బ్యాచ్ IAS అధికారి. రెండు వారాల క్రితం లక్నోలోని నీటితో నిండిన వీధులను ఆమె పరిశీలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోషన్ ఎవరు.. ఆమె ఎక్కడ్నుంచి వచ్చారు. పేదల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ ఏంటి? ఆమె నిజంగా సర్వీస్ చేస్తున్నారా.. లేదంటే అసలేం జరుగుతుందన్నదానిపై నెటిజెన్లు యంక్వైరీలు మొదలుపెట్టారు.