కుప్పంలో ఎలా గెలుస్తావో చూస్తాను: పెద్దిరెడ్డి
కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి మండి పడ్డారు. ప్రజలను పోలీసులపై తిరగబడండి అని చంద్రబాబు పిలుపునివ్వడమేంటని ఆయన నిలదీశారు. ఒక వార్డు మెంబర్ కంటే దిగజారి చంద్రబాబు కుప్పం పర్యటనలో మాట్లాడారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే రోజుల నుంచి చంద్రబాబుపై తనదే పై చేయి అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు చేస్తున్న చౌకబారు విమర్శలను ఆపాలని మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు.

