వారంలో రెండు రోజులు విశాఖలో ఉంటా..!
మూడు రాజధానుల వ్యవహారంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ముందుగా క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గతంలోకి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంత్రివర్గం సహచర మంత్రులతో విశాఖ అంశాన్ని మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నుండి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించి వారంలో రెండు రోజులు అక్కడ నుంచి పాలను చేపట్టాలని ఆ దిశగా మంత్రులంతా సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదించిన అంశాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలిపారు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావటం పై ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు అభినందనలు తెలిపారని అభినందనల తీర్మానాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు.


