నేను మ్యాచ్ చూస్తే భారత్ ఓడిపోతుందనే భయంతో చూడలేదు: అమితాబ్
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి గురయ్యారు. తాను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదన్నారు. తాను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ సాగినంతసేపు తాను టీవీ ఆన్ చేయలేదని చెప్పుకొచ్చారు. భారత్ గెలిచిందని తెలిశాక సంతోషంతో కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్‌కు పలువురు సినీ తారలు విషెస్ తెలిపారు.

