‘అమ్మను సాయం చెయ్యెద్దన్నాను’, కానీ ఇప్పుడు..జాన్వీ కపూర్
తనకు కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి కుమార్తెగా గుర్తింపు తెచ్చుకోవడం ఇష్టం లేదని, అందుకే అమ్మను నటనలో సాయం చెయ్యెద్దని చెప్పానని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు తలుచుకుంటే ఎంతో బాధగా ఉందని, ఆమె కూతురునయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తొలిచిత్రం ‘ధడక్’ చిత్ర షూటింగుకు శ్రీదేవిని రావొద్దని, ఆమె నటన ప్రభావం తనపై పడకుండా భిన్నంగా నటించాలనుకున్నానని జాన్వీ పేర్కొంది. ఇప్పుడు తన కెరీర్ మంచి దారిలో పడి ఉత్తరాదితో పాటు దకిణాది చిత్రాలలో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సంతోషపడ్డారు. ఈ సమయంలో అమ్మ ఉండి ఉంటే ఎంతో సంతోషపడేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతీ విషయంలో ఆమె సలహా తీసుకోవాలనిపిస్తోందని, శ్రీదేవి కుమార్తెగా తనను పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యింది. అమ్మా, షూటింగుకు టైమవుతోంది త్వరగా రా అని శ్రీదేవిని తనతో షూటింగుకు తీసుకెళ్లాలనిపిస్తోందని, ఆమెతో మాట్లాడుతున్నట్లనిపిస్తోందని తన మనోభావాలు పంచుకున్నారు జాన్వీ. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో ఆరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకునిగా కనిపించబోతున్నారు. జాన్వీ తంగమ్ అనే అమ్మాయి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం రెండుభాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

