‘సచిన్‌కు ఋణపడి ఉన్నాను’..మాజీ క్రికెటర్..
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం విషమంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తీవ్ర అస్వస్థతతో, యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో ఠానె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌కి, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎప్పుడూ సచిన్ తెండూల్కర్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారని, అతనికి ఎంతో ఋణపడి ఉన్నానని తెలిపారు. గతంలో కూడా 4 సార్లు హార్ట్ ఆపరేషన్లు జరిగాయని అప్పుడు సచిన్ సహాయం చేశారని తెలిపారు. కాంబ్లీకి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ పేర్కొన్నారు. కాంబ్లీకి సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు తెలిపారు. నిరంతరం అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

