గాజాలో పేకమేడల్లా కూలిన భవంతులు-వేలమంది మృతి
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజాలో బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. వేలమంది దుర్మరణం పాలవుతున్నారు. ఒకపక్క ఇజ్రాయెల్ దాడులు, మరోపక్క హమాస్ దాడులతో గాజా నగరం చిగురుటాకులా వణికిపోతోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ ఆదేశాల ప్రకారం ఉత్తర గాజాలోని పాలస్తానీయులు ప్రాణభయంతో వలసదారి పట్టారు. ఉగ్ర నెట్‌వర్క్ గాజాలోని సొరంగాలలో తల దాచుకోవడంతో ఈ నగరంపై వారం రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెలీలను బందీలుగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 1300లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయని, 55 వేల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ (OCHA) అనే సంస్థ వెల్లడించింది. ఆస్థి నష్టమే కాకుండా భారీ ప్రాణనష్టాన్ని చవి చూస్తోంది గాజా. ఇక్కడ 2 వేలకు పైగా పాలస్తానీయులు మరణించారని, మరో 9 వేల మంది గాయపడ్డారని హమాస్ తెలిపింది.