కనిపించని రైలుబండి- నగరవాసుల పాట్లు
గతవారం రోజులుగా కుండపోత వానలతో తడిసిముద్దవుతున్న హైదరాబాద్ నగరవాసులకు మరో ఇబ్బంది వచ్చిపడింది. ఉద్యోగాలకు వెళ్లకపోతే సాధారణప్రజలకు రోజు గడవదు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా, ఇతర ఉద్యోగాలకు సెలవు లేకపోవడం, మరియు కూలీపనులు చేసుకొనే జనాలు ఎంఎంటిసీ రైళ్లు రద్దు చేయడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత 2రోజులుగా ఎంఎంటిసీ రైళ్లు తిరగక బస్ లలో స్థలం లేక, బైక్ లపై వెళ్లలేక ప్రజలు కష్టపడుతున్నారు. విద్యార్ధుల కోసమే రైళ్లను నడుపుతున్నారా, మా పరిస్ధితి ఏంటి అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read More: రాజధానిని వీడని డెంగీ ఫివర్