InternationalNews

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి ముందంజ

Share with

బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు రావడం, ప్రజలతో పాటు సహచరుల్లో విశ్వాసం కోల్పోవడంతో జాన్సన్ గతవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో, ప్రధాని పదవికి, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి ఎన్నికలు వచ్చాయి కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ మొదలైంది. భారత మూలలున్న మాజీ ఆర్ధిక శాఖ మంత్రి రిషి సునక్ ఎంపీల మొదటి రౌండ్‌లో విజయం సాధించారు. సునక్ 88 ఓట్లతో అగ్రస్ధానంలో నిలిచారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో రెండో స్ధానంలో, 50 ఓట్లతో విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ మూడో స్ధానంలో నిలిచారు. వీరితో పాటు మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టామ్ టుగేన్ థాట్ అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఎంపీల మద్దతుతో రిషి సునక్ దూసుకుపోతున్నారు. .పెన్నీకి కూడా మద్దతు గణనీయంగా పెరుగుతుండడంతో పోటీ ఆసక్తిగా మారింది
ఈ దశలో 30 కన్నా తక్కువ ఓట్లు వచ్చినవారు పోటి నుంచి తప్పుకుంటారు. ఈ కారణంగా ఛాన్స్‌లర్ నదీమ్ జాహవీ, మాజీ ఆరోగ్య కార్యదర్శి జెరెమీ హంట్పోటి నుంచి వైదొలిగారు. గురువారం రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతోంది. మెదటి రౌండ్‌లో 30 ఓట్లు దాటిన ఆరుగురు అభ్యర్ధులు రెండో రౌండ్‌లో పోటీపడనున్నారు. వచ్చేవారానికి ఈ పోటీలో జూన్ 21 కల్లా ఇద్దరే మిగలాల్సి ఉంటుంది. అది రిషి,పెన్నీయే ఉంటారని వారిలో ఒక్కరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా… ప్రధాన మంత్రిగా ఎన్నుకునే బాధ్యత టోరి సభ్యులపై ఉంటుంది. ఈ దశలో సుమారు 2లక్షల టోరీ సభ్యులు ప్రియతమ నాయకుడికి ఓటేస్తారు.సెప్టెంబర్ 5న చివరి దశ ఫలితాలు ప్రకటిస్తారు.

Read More: తెలుగువెలుగు… అమెరికాలో టాప్ 20 భాషల్లో తెలుగు