NewsTelangana

మెట్రో ప్రయాణికులకు తిప్పలు

Share with

మెట్రో ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ లో ట్రాన్స్ పోర్ట్ రూపురేఖలు మారిపోయాయ్.. అప్పటి వరకు దిల్ షుక్ నగర్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే గంటల తరబడి సమయం పట్టేది. అలాగే ఎంతో వ్యయ ప్రయాసలకు గురవ్వాల్సి వచ్చేది. కానీ మెట్రో ఆ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ప్రయాణ వేగాన్ని, ట్రాఫిక్ లేకుండా గమ్యస్థానాలకు చేర్చే వేదికగా మారింది. దీంతో ఎక్కువ మంది ఖరీదు ఎక్కువైనా మెట్రోను ఆశ్రయించడం మొదలుపెట్టారు. పెట్రోల్ ధరలు , ట్రాఫిక్ సమస్యల  కారణంగా మెట్రోలో ప్రయాణించడానికే ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారణంగా మెట్రోలో తీవ్ర రద్దీ నెలకొంది. నాన్ పీక్ అవర్స్‌లో 7 నిమిషాలకు ఓ మెట్రో నడుపుతుండటంతో నిలబడేందుకు సైతం చోటు ఉండటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై  ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్భందికి కంప్లైంట్‌లు ఇచ్చిన ప్రయోజనం లేకపోవడంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా సమస్యలను తెలిపారు.  మధ్యాహ్నం వేళ మెట్రో ట్రిప్పులు తగ్గించడంతో మహిళలు జనరల్ కోచ్‌లో ప్రయాణించడానికి సంకోచిస్తున్నారు.

ఉదయం 8 లోపు తప్ప రోజంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండే మెట్రోలో …  ఒక్క మియాపూర్ నుండి ఎల్‌బి నగర్ వెళ్లే  మెట్రో  మార్గం ద్వారానే రోజుకు 2 లక్షల మంది వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి మార్గంలో ప్రయణించే వారికి నాన్ పీక్ అవర్స్ కారణంగా ప్రయణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలానే  కొన్ని చోట్ల క్యూఆర్ సమస్యల కారణంగా ఎగ్జిట్ వద్ద అప్పుడప్పుడూ గందరగోళం నెలకొని రాకపోకలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మెట్రో సమయంలో మార్పులను… క్యూఆర్ కోడ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ కు ఏకరువు పెట్టారు.