తియ్యని తెలుగులో నా ఆఖరి సందేశం.. ఆండ్రూ ఫ్లెమింగ్
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు యూకే తరపున డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించిన ఆండ్రూ ఫ్లెమింగ్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్బంగా తెలుగులో మాట్లాడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు ఫ్లెమింగ్. తెలుగు ప్రజల అభిమానాన్ని ఎప్పటికి మరచిపోలేనన్నారు. అందరికి ఆరోగ్యం , ఆనందం , ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నానంటూ తెలుగులో మాట్లాడుతున్న వీడియోను ఆయన ట్వీట్ చేసారు.
ఐదేళ్ల పదవీకాలం ముగుస్తున్న రోజున తియ్యని తెలుగులో నా ఆఖరి సందేశం అని రాసుకొచ్చారు. జూలై 2017లో ఆండ్రూ ఫ్లెమింగ్ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణకు యూకే తరపున డిప్యూటీ హైకమిషనర్ అయ్యారు. UK, ఇండియా.. మరీ ముఖ్యంగా… తెలుగు ప్రాంతాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా ప్రజలతో కనెక్ట్ అవ్వడంతో ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది.