భార్యను తట్టుకోలేక విడాకులిచ్చేసిన భర్త.. విషయం తెలిస్తే షాక్..
భార్య భర్తల మధ్య తరుచుగా గొడవలు జరగడం సహజం. ఆ గొడవలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరిపోతాయి. ఆఖరికి ఆ భార్యభర్తలు విడాకులు తీసుకునే స్థాయికి చేరిపోతారు. ఇలాంటివి ఘటనలు తరుచుగా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ స్టోరీని చదివితే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే.. ఓ భర్త తన భార్య గుబురు గడ్డాన్ని తట్టుకోలేక విడాకులు ఇచ్చేశాడు. భర్త నుండి దూరం అయిన ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయింది. ఆ తరువాత ఆమె పరిస్థితులతో రాజీపడటం నేర్చుకుని క్రమంగా కోలుకుంది. ఇటీవలే మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంది.

పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్‌కు 2012లో వివాహం జరిగింది. వివాహానికి ముందు ముఖంపై రోమాలే ఎరుగని ఆమె పరిస్థితి ఆ తరువాత ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. చూస్తుండగానే ముఖంపై గుబురు గడ్డం ప్రత్యక్షమైంది. ఈ పరిణామాలను తట్టుకులేని ఆమె భర్త విడాకులిచ్చేశాడు. ఇలా అనూహ్యంగా జీవితం తలకిందులుగా మారిపోయింది. దీంతో మన్‌దీప్ కౌర్ తీవ్ర దు:ఖంలో కూరుకుపోయింది. అయితే.. ఆమె దైవ ప్రార్థనతో ప్రతికూల భావాలను తొలగించుకుంది. రోజూ గురుద్వారాకు వెళ్లడంతో తనలో మార్పు మొదలైందని మన్‌దీప్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గడ్డం తీసుకోవడం కూడా మానేసింది. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషుడే అనుకుంటారని తెలిపింది. ప్రస్తుతం మగాళ్లలాగానే బైక్ నడుపుతానని, తన సోదరులతో కలిసి పొలం పనులకు వెళతానని కూడా ఆమె వివరించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

