భార్య ముక్కు అందంగా ఉందని కొరికేసిన భర్త..
పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా శాంతీపుర్ పీఎస్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త.. భార్య ముక్కు అందంగా ఉందని కొరికేశాడు. నీ ముక్కు అందంగా ఉంది.. అవకాశం దొరికితే కొరికి తినేస్తానని తన భర్త అనేవాడని, చివరకు అన్నంత పని చేశాడని భార్య మధు ఖాతూన్ వాపోయింది. దీంతో ఆమె భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు.

