Breaking NewsHome Page SliderInternational

మార్స్ పై మ‌నుషులా?!

ఈ విశ్వంలో ఏలియన్స్‌ కోసం కొన్నేళ్లుగా మనం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఏలియన్స్‌ ఉన్నారనే ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు. కానీ, కచ్చితంగా ఏలియన్స్‌ ఉన్నాయి అని మాత్రం చాలా మందిలో బలమైన నమ్మకం ఉంది. అయితే.. ఏలియన్స్‌ ఎక్కడో కాదు, మన సౌర కుటుంబంలోని అంగారక గ్రహంపైనే ఉన్నారని తెలిసింది. గతంలో భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ భూమికి పంపింది. అంగారక గ్రహంపై అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ గతంలో టీజీవోను ప్రయోగించింది. అయితే ఈ సందేశాన్ని గ్రహంతర వాసులే పంపారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అలాగే ఇటీవలె చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి, అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. వీటన్నింటిని బట్టి అంగారక గ్రహంపై ఏలియన్స్‌ ఉన్నాయనే విషయాన్ని చాలా మంది విశ్వసిస్తున్నారు.