లోకల్స్‌కి భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టులకు ప్రకటన వెలువడింది. 1500 పోస్టులకు గాను తెలంగాణలో 200 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దీనికి దరకాస్తు చేయాలంటే డిగ్రీలో స్థానిక భాషను చదువుకుని ఉండాలి. అక్టోబర్ 1 నాటికి, 30 ఏళ్లు మించని వారు అర్హులు. వీరికి ఎంపికైతే రూ.77వేల వరకూ ఆదాయం లభిస్తుంది.

