home page sliderHome Page SliderTelangana

ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం పట్టివేత..

హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన విమాన సిబ్బంది దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. మస్కట్ నుంచి బంగారం తెచ్చి గ్రౌండ్ స్టాఫ్ కు ప్యాసింజర్లు అందించారు. ఎయిర్ పోర్ట్ నుంచి బంగారాన్ని బయటికి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ స్టాఫ్ ప్రయత్నించగా.. 3.5 కిలోల గోల్డ్ ను పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 3 కోట్ల 45 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.