Home Page SliderTelangana

భారీ అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం

తూప్రాన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లిమ్రా మోటార్స్ మెకానిక్ షెడ్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 8 కార్లు కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.