మహేశ్ దంపతుల భారీ విరాళం
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళం అందజేశారు. ఇటీవల భారీ వరదల కారణంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును సమర్పించారు. దీనితో పాటు మహేశ్ బాబు మల్టిప్లెక్స్ ఏఎమ్‌బీ సంస్థ తరపున మరో రూ.10లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మహేశ్ బాబుకు శాలువా కప్పి సత్కరించారు. ఇటీవల చిత్రపరిశ్రమలోని నటులు, నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు సమర్పించారు.

