విశాఖలో సిలిండర్ భారీ పేలుడు..మృతులకు ముఖ్యమంత్రి పరిహారం
విశాఖపట్నం: విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఓ స్క్రాప్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సిలిండర్ పేలడంతో ముగ్గురు మరణించి, మరో ముగ్గురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. అయితే ప్రమాదం ధాటికి చనిపోయిన వారి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది. విషయం తెలుసుకున్న నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాధితుల పరామమర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనతరం ఆయన ప్రమాదంపై మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కొనఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారని సమాచారం.