బీజేపీ నేత హాట్ కామెంట్…
మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మరోవైపు మునుగోడు బై ఎలక్షన్స్‌పై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక లేకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మునుగోడుకు రాహుల్ గాంధీ వచ్చినా కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఫలితం ఉండదని, కమ్యూనిస్టులు సైతం ఒంటరిగా గెలవలేరన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఇంద్రాసేనా రెడ్డి స్పష్టం చేశారు.