NewsTelangana

సూర్యాపేటలో పరువు హత్య

తెలంగాణాలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. సూర్యాపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గత మూడు రోజుల క్రితం కనబడకుండా పోయిన నిఖిల్ ఈ రోజు సాగర్ కాల్వలో శవమై తేలాడు. దీంతో నిఖిల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా నిఖిల్ మృతికి ప్రేమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా నిఖిల్ ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చేతికి అంది వచ్చిన కుమారుడు శవమై తేలడంతో నిఖిల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడ్ని హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిఖిల్ అనుమానాస్పద మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.