సోషల్ మీడియా పోస్టులపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వ్యక్తులను వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. ఇప్పటి వరకూ విచారించిన కేసుల్లో వారు పెట్టిన పోస్టులు చూస్తే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతోందన్నారు. చివరికి న్యాయమూర్తులను కూడా వదల్లేదని, వారి పోస్టులపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. తన తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్ అరెస్టు చేయకపోయినా, మేం అరెస్టులు చేస్తున్నాం అని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తున్నారో తెలుస్తోందన్నారు.


 
							 
							