వారణాసిలో చితాభస్మంతో హోళీ వేడుకలు
దేశవ్యాప్తంగా హోళీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, విశ్వేశ్వరుడు కొలువైన వారణాసిలో సాధువులు అక్కడి స్మశానంలో దొరికే బూడిదను చల్లుకుంటూ హోళీ పండుగను జరుపుకుంటారు. మసాన్హోళీగా జరుపుకునే ఈ హోళీ వేడుకల్లో సాధువులతో పాటు శివ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివుడు స్వయంగా తన భక్తులను బూడిదతో హోళీ ఆడటానికి అనుమతిస్తాడని వీరంతా నమ్ముతారు.చాలా కాలం నుంచి చితాభస్మంతో హోళీ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దీనికోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేసింది.

